26, సెప్టెంబర్ 2016, సోమవారం

అలా మొదలయింది

1989 వ సంవత్సరం... 

కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత  ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే .......  'పుణ్యగిరి' పాద పీఠే 





అక్కడ .... అంతా హడావుడిగా ఉంది.  ఒక వైపు ఎతైన కొండలు; అంతటా పరుచుకున్న వెదురు పొదలు, ఏవేవో చెట్లు, వాటికి అల్లుకున్న తీగలు; మధ్యలో జలజల పారే సెలయేరు; ఒక వైపుగా కొండ పైకి వెళ్లేందుకు మెట్లు; మరో వైపు పచ్చని పంటపొలాలు దూరంగా ఎత్తైన టేకు చెట్లు .... నేనేమీ ఏదో  పిక్నిక్ స్పాట్ ని వర్ణించడం లేదు.  అది మా కాలేజీ ప్రాంగణం

ఆ హడావుడికి కారణం అప్పుడే మొదలైన అడ్మిషన్లు.  కొత్తగా కట్టిన భవనాలు - అంతకు రెండు సంవత్సరాలకు ముందే ఎస్. కోట లో తాత్కాలిక భవనాలలో ప్రారంభమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల,  ఈ సంవత్సరం నుండి ఊరికి దూరంగా పుణ్యగిరి లో కట్టిన సొంత భవనాలలోకి మారుతుంది. సీట్ల కోసం ప్రయత్నిస్తున్న నవ యువతీయువకులు, వారి తల్లిదండ్రులతో ఆ ప్రదేశమంతా కళకళ లాడుతుంది.


మొత్తానికి అడ్మిషన్ ప్రక్రియ ముగిసింది.  క్లాసులు మొదలవుతున్నాయి.  అమ్మాయిలు, అబ్బాయిలు - అంతకు ముందే పరిచయమున్న వాళ్ళు, పరిచయం లేనివాళ్లు, కొత్తగా వచ్చిన వాళ్లు, లోకల్, నాన్-లోకల్ అందరూ ఒకచోటికి చేరుకున్నారు.   


వాళ్ళ జీవితాలలో ఒక సరికొత్త అధ్యాయం మొదలయింది.  


(సశేషం)

Picture courtesy: Google/image owner

4 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. కిషోర్‌గారు! నా బ్లాగ్‌లో మీర్రాసిన కమెంట్ వెంటే ఇలా వచ్చాను. మీ కాలెజీకబుర్లు మొదలుపెట్టి ఆపేశారు. వీలైతే మళ్ళీ మొదలుపెట్టండి :) Happy Blogging!

    రిప్లయితొలగించండి